కవిత మా ఇంటికి పెద్ద కూతురే కాదు, రెండు కుటుంబాలకు పెద్ద మనవరాలు కూడా. కవిత పుట్టినప్పుడు కుటుంబం అంతా మా ఊరిలో ఉన్న ఫంక్షన్ కి వెళ్లడం వలన సమయానికి కవిత వాళ్ళ అమ్మ దగ్గర ఎవరూ లేకపోయారు. ఆ సమయంలో హాస్పటల్కి తీసుకెళ్లడానికి సరైన సమయం లేక ఇంటిలో దగ్గరలోని మంత్రసాని చేత పురుడు పోయించారు లలిత అమ్మా నాన్న. ఆ మంత్రానికి సరైన అవగాహన లేక చంటి బిడ్డను పుట్టిన వెంటనే ఏడిపించక పుట్టిన బిడ్డను అలాగే నేలమీద పడుకోబెట్టింది.
ఆ తరువాత కార్యక్రమాలు యధావిధిగా జరిపించి, పుట్టిన పాపాయికి నామకరణం చేసింది కవిత అనే పేరు పెట్టారు. కవిత ఒక సంవత్సరం నిండింది, కానీ అందరి పిల్లల బోర్లా పడడం చేయడం లేదు. ఎక్కడ వేసిన అక్కడే కదలక, మెదలక కుండా ఉండేది.లలితకు కూడా చిన్న వయసు కావడం ఎప్పుడూ తన లోకం పుస్తకాలే కావడం వలన కవితను పట్టించుకునేది కాదు. కవితా తాతగారు లలిత నాన్న గారైన సోమనాథ్ కి ఊళ్లు తిరిగి ఉద్యోగం కావడం వలన వెళ్లిన చోట సరైన సదుపాయాలు లేక పట్టించుకోలేదు.
తరువాత వెనక్కి తిరిగి చూసేసరికి కవిత పరిస్థితి తెలుసుకుని బాధపడి తన ఇంటికి తీసుకుని వెళ్ళి కవిత కవిత మానసిక వికలాంగురాలు అని తెలుసుకుని మందులు వాడుతూ స్వీకరించారు సోమనాథ్. ఆ తరువాత కవిత వాళ్ళ అమ్మమ్మ వాళ్లది చాలా పెద్ద కుటుంబం కావడం వలన అందరి ఆలనాపాలనా కవిత మెల్లమెల్లగా పాకడం చిన్నగా లేచి నిలబడడం చేస్తుంది. కవిత కు ఐదు సంవత్సరాలు వచ్చాయి. లలితా కార్యక్రమంలోనూ ఒక బాబు పుట్టడంతో కవితను పూర్తిగా వాళ్ళ నాన్నగారి దగ్గర వదిలేసింది. కవిత వాళ్ళ తాతగారు ట్రాన్స్ఫర్ మీద లలిత ఉన్న ఊరికి దగ్గరగా రావడం వలన తరుచూ అంతా కలిసి ఉండేవారు.
కొన్నాళ్ళకి సోమనాథ్ గారికి రిటైర్మెంట్ వయసు దగ్గర పడడంతో లలిత ఉన్న ఊరిలో ఇల్లు కట్టుకుని లలితను కూడా తాము దగ్గర ఉంచుకోవాలి అన్న ఆలోచన చేసి అటు వైపు అడుగులు వేశారు. ఆ విధంగానే ఈ కవితను మానసిక వికలాంగుల పాఠశాలలో చేర్చి, తానే దగ్గర ఉండి కవిత విషయాలు చూసేవారు తాతగారు. అలా కవిత కొంచెం బాగవుతుంది సమయానికి సోమనాథ్ గారు,అతని భార్య రెండు సంవత్సరాల గ్యాప్ లో మరణించారు.
అంతవరకూ కవితా బాధ్యత లేని లలితా భార్యాభర్తలు కవితను పట్టించుకోలేదు.తిరిగి స్కూల్ మానిపించి ఇంట్లో ఉంచేశారు.కవిత పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అమ్మమ్మ ఉన్నప్పుడు ఎంతో సందడిగా ఉన్న ఇల్లు అమ్మమ్మ తదనంతరం ఎవరికి వారు అవ్వడం వలన కవిత వాళ్ళ తాతగారు కవిత కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ సోమనాథ్ గారి మరణాంతరం కవితను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. రాను రాను కవిత ఏది తినాలన్నా రకరకాల జబ్బుల పేరు చెప్పి సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు లలిత వాళ్ళు. ఆఖరికీ కవిత కన్నా తల్లిదండ్రుల కే భారంగా తయారయ్యి, సరియైన ఆలనాపాలనా లేక మరణించింది.