అక్టోబర్ 17, 2020

పాఠశాలలో మంచి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎలా మరిచిపోగలరు

 ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత హోదా కి వెళ్ళాలి అన్న, సమాజం అతన్ని గుర్తిస్తుంది అంటే దానికి కేవలం కారణం ఉపాధ్యాయులు అని చెప్పవచ్చు.ఒక వ్యక్తి లాయర్ అవ్వాలన్న, ఇంజనీర్ అవ్వాలన్న భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్న దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది.చిన్నప్పటి నుంచి పిల్లవాడి లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే.


ప్రపంచంలో గొప్ప గొప్ప హోదా లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే మాట ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం ఉపాధ్యాయులు.మాకు చక్కని విద్యాబుద్ధులను నేర్పించారు వారు.మేము ఎదుటి వ్యక్తి తో ఎలా మాట్లాడాలి చిన్న వాళ్లతో ఎలా ఉండాలి పెద్ద వాళ్ళతో ఎలా ఉండాలి.అనే విషయాలను మాకు చెప్పింది మా ఉపాధ్యాయులు.వాళ్లు పాఠాలు చక్కగా చెప్పారు కాబట్టి మేమ విని ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను.మేము తప్పు చేస్తే మమ్మల్ని ఖండించారు.అలాగే మమ్మల్ని చాలా అన్ని విధాలుగా ప్రోత్సహించారు.ఆట, పాటలను నేర్పించారు.కొట్టినా కసురుకుంది ఉపాధ్యాయులు అయినా విద్యాబుద్ధులు నేర్పించారు. 

ఒక వ్యక్తి సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంటుంది. ఉపాధ్యాయులు చిన్నప్పుడే అంటే పదో తరగతి వచ్చే టప్పుడు విద్యార్ధి జీవితంలో ఏం సాధిస్తాడు ఏమి చేయగలడు అనే ఒక అవగాహన గురించి విద్యార్థులకు చెబుతారు.వాళ్లు ఏ రంగాల్లో రాణిస్తారు భవిష్యత్తులో అనే దని గురించి కూడా చెబుతారు.విద్యార్థుల్లో ఉన్నటువంటి లక్షణాలను గమనిస్తారు.తప్పు చేస్తే వాడిని మందలిస్తారు. ప్రపంచంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది.సమాజం లో ఒక వ్యక్తి మనుగడ సాగించాలన్న అభివృద్ధి చెందాలన్నా అది కేవలం ఉపాధ్యాయుల చలవే.

అందుకని మనం మన ఉపాధ్యాయులను ఎలా మర్చిపోగలం.విద్యలేనివాడు వింత పశువు అని చెప్పింది ఉపాధ్యాయులు.విద్యను నేర్చుకోవటం వలన మనకు జ్ఞానోదయం కలిగింది.అలాగే సమాజంలో ఎలా ఉండాలో తెలిసింది.పాఠశాల రోజులలో మనకి కష్టపడే తత్వాన్ని నేర్పిచింది ఎవరు.మన ఉపాధ్యాయులే కదా ప్రతి ఒక పాఠాన్ని క్షుణ్ణంగా మనకు చెప్పారు.తప్పు చేస్తే మందలించారు.బాగా చదవమని ప్రోత్సహించారు ఉపాధ్యాయులు.తల్లిదండ్రులను గౌరవించండి అని చెప్పారు.అన్నదమ్ములతో స్నేహంగా మెలగాలి అని చెప్పారు.

ఆటల వల్ల శారీరక మానసిక ఉల్లాసం ఎలా కలుగుతుందో చెప్పారు.మనల్ని మంచి విద్యార్థులు గా తీర్చిదిద్దారు. కోపం వలన విద్యార్థి ఏమి సాధించలేడు.కృషి, పట్టుదలతోనే సాధిస్తాడు.అందుకని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం.ఇది మనం మన ఉపాధ్యాయులు ఇచ్చే గౌరవంగా భావించాలి.చదువుకోవడం వలన కలిగే ఉపయోగాలు గురించి మనకు ఉపాధ్యాయుల తెలపడం జరిగింది.మనకి తెలివితేటలు గురించి బోధించారు. మనలోని నైపుణ్యాలను తీసుకు బయటకు తీసుకు వచ్చింది ఎవరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...