ఆరోజు ఉదయం 9 గంటలకు వర్షం పడుతుంది. క్రికెట్ మ్యాచ్ సాయంత్రం 4:30కి. ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా? వర్షం ఎక్కువగా ఉంది. మ్యాచ్ జరిగితే బాగుండు అనేది నా అభిప్రాయం. ఇంతలో స్నేహితులు సందేశం చేస్తున్నారు. పరిస్థితేమిటి? వర్షం పడుతుంది గా. నా ఫ్రెండ్స్ పేరు చెప్పడం మర్చిపోయాను. రాజు,రోజా, లక్ష్మి ,రాణి, సాకేత్, అందరికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.
ఇంతలో రాజు సందేశం పంపించాడు. ఈ రోజు సమయం బాగుంటుంది లే. మనం ఆటకి వెళ్ళవచ్చు. వర్షం తగ్గిపోతుంది రాహుల్. నా పేరు రాహుల్. సమయం ఉదయం 11 గంటలు అయినది. అయినా వర్షం పడుతూనే ఉంది. మొత్తానికి మధ్యాహ్నం వర్షం కురవడం ఆగిపోయింది. మైదానం ఇంటి స్థలం నుంచి దాదాపు 15 మైళ్ళు. సాకేత్ నాన్నగారికి నాలుగు కారు వాహనం ఉంది. అది వేసుకొని సాకేత్ మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. మా నాన్నగారికి చెప్పాను. మైదానానికి వెళ్తున్నాం నాన్నగారు అని. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని. సాకేత్ వాహనం లో మంచి పాటలు పెట్టాడు. రోజా కూడా పాటలు పాడుతుంది. రాజు అడిగాడు రోజాను పాడుఅని. రోజా పాడను అని చెప్పింది.
సమయం సాయంత్రం 4 అయింది. మైదానం లో ప్రేక్షకులు ఉన్నారు. ఇంతకీ మేము వెళ్ళింది ఎక్కడికో తెలుసా.విశ్వవిద్యాలయాల తుది సమరం కోసం.మేము తినడానికి కొన్ని పదార్దాలను తీసుకువెళ్ళాము.ఆట ప్రారంభం అయినది.
ఇది 20. స్నేహితులతో పాటు మేమందరం మ్యాచ్ చూస్తున్నాము.ఆట ఆసక్తిగా ఉంది. ఇంతలో రాజు హాస్యం చేస్తున్నాడు. మిగతా స్నేహితులం అందరం నవ్వుకుంటున్నాము.మేము అందరం తిరుగు ప్రయాణం అయ్యాము. రాజు కి జ్వరం తగిలింది.
దగ్గరిలోనీ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాము. వైద్యులు రాజు జ్వరం చూశారు. 102 ఉంది. రాజు చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు.వైద్యులు సూది మందు మరియు బిళ్లలు ఇచ్చారు. కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు. తిరుగు ప్రయాణం అయ్యాము. రాజుకి తండ్రి ఫోన్ చేసారు. ఇలా జరగడం దురదృష్టం విషయం. ఇలా చాలా సరదాగా గడిపారు. ఈరోజు మా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఇలాంటి రోజులు ఇంకా రావాలి అని చెప్పి అనుకుంటున్నాము. మళ్లీ కచ్చితంగా వచ్చే నెలలో చలనచిత్రం చూడడానికి వెళ్తాము. క్రికెట్ మా జీవితాలలో భాగం. మేమందరం ఏం చెబుతున్నారో మీకు చెప్పలేదు కదా. డిగ్రీ చదువు చదువుతున్నాము. రాజు కి సందేశం పంపించాను. ఎలా ఉన్నావు రాజు. రాజు సమాధానం ఇచ్చాడు ఏమీ బాగాలేదు నా ఆరోగ్యం. మళ్లీ వైద్యుని అవసరం ఉంది. సరే రాజు అని నేను చెప్పాను. ఇంతలో రోజా సందేశం పంపింది. రాజు ఎలా ఉంది అని. నేను అడిగాను నువ్వు మాట్లాడలేదా రాజుతో. లేదు అని సమాధానం చెప్పింది. సరే మాట్లాడు.మేమందరం రాజు ఆరోగ్యం గురించి సందేశాలు పంపుకున్నాము. ఎన్ని బాధలొచ్చినా స్నేహితుడికి అనేది కష్టంగా ఉంటుంది.
మరుసటి రోజు మేము అందరం కలిసి రాజు ఇంటి దగ్గరికి వెళ్లడం జరిగింది. మేము వెళ్ళే సరికి రాజు నిద్రపోతూ ఉన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you want to ask me anything just ask here