నవంబర్ 01, 2020

కోపం వల్ల కలిగే అనర్ధాలు

 ఒకరోజు తీరిగ్గా కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను.రోడ్డు పక్కన బండి మీద చాయ్ వేస్తున్నాడు రాజు.ఆ రోజు పని ఎక్కువైంది అతనికి. లారీ డ్రైవర్లు, క్లీనర్లు వేరే వాళ్ళు అందరూ అక్కడ చాయ్ తాగి వెళ్తున్నారు.అంతా కోలాహలంగా ఉంది.

కుక్క అక్కడి జనాల మధ్య తిరుగుతూ వాళ్ళు ఏదైనా పడేస్తే తింటుంది.రాజు దాన్ని తరుముతున్నాడు, ఎంత తరిమిన మళ్ళీ వచ్చి జనాల కాళ్ళ మధ్య జరుగుతుంది.కొందరు దాన్ని దగ్గరకు పిలుచుకొని బిస్కెట్ లాంటివి తినిపిస్తున్నారు.




ఒక డ్రైవరు ఫోన్లో ఎవరితోనో కోపం గా మాట్లాడు కుంటూ ఛాయ్ బండి వైపు వచ్చి కూర్చున్నాడు. కోపంగా మాట్లాడుతూ రాజు ఇచ్చిన ఛాయ్ చేతిలోకి తీసుకున్నాడు.ఇంతలో కాలికి ఏదో తగ్గినట్టు అనిపించినా ఒక్కసారిగా లేచేసరికి చేతిలో ఉన్న చాయ్ షర్ట్ పై పడిపోయింది. ఏమైంది ఏమైంది అంటూ వచ్చి చూసాడు రాజు. రాజు ఏముంది అదే కుక్క, రాజు మీద గయ్ మని లేచాడు ఆ డ్రైవర్. ఈ కుక్కలు ఎందుకు పెంచుతున్నావు అని కేకలు పెట్టాడు. లేదు ఆ పక్క నాది కాదు క్షమించండి అని చెప్పి అతనికి ఇంకో చాయ్ ఇచ్చి పంపించాడు. కుక్క ను తిడుతూ దాని మీదకి బండరాయిని కోపంగా విసిరాడు రాజు, కుక్క తప్పించుకుని దూరంగా పారిపోయింది. రాజు మళ్లీ పనిలో నిమగ్నమయ్యాడు.

జనాలు వస్తున్నారు వెళ్తున్నారు,కొద్దిసేపు కుక్క కనబడలేదు. ఎండ నడి నెత్తి మీద వచ్చింది. రాజు వ్యాపారం చాలా బాగా నడుస్తుంది కానీ చాలా పని ఒత్తిడిలో ఉన్నాడు. పాల ప్యాకెట్ చింపి గిన్నెలో పోశాడు. ఎవరో పలకరించగా అటు తిరిగాడు ఇంతలో గిన్నె పడిన చప్పుడు విని ఇటు చూశాడు. కుక్క పాలన్నీ పారబోసి ఉంది. అతనికి మతిపోయింది, కోపంతో ఊగిపోయాడు. పెద్ద కర్ర తీసుకొని కుక్క నడుము మీద ఒక్క దెబ్బ వేసాడు. కుక్క కుప్పకూలిపోయింది. రాజుకి కోపం చల్లారలేదు ఇంకో దెబ్బ వేసేసరికి అది సరిగ్గా కుక్క తల పై పడింది. ఆ దెబ్బకి కుక్క చచ్చిపోయింది. అందరూ చూస్తూ ఉండిపోయారు. కుక్క చనిపోతుందని అతను అనుకోలేదు.



ఇంతలో నాలుగు కుక్క పిల్లలు వచ్చి చనిపోయిన కుక్క చుట్టూ చేరాయి. పాపం ఆ పిల్లలు దానివి. అది కళ్ళు తెరిచి నడక నేర్చుకున్న సమయానికి అది చనిపోయింది. ఆ దృశ్యం హృదయాన్ని పిండేసే లా ఉంది. చూసిన వాళ్ళందరూ రాజుని తిట్టిపోశారు, అన్యాయంగా మూగ జీవిని చంపావు అన్నారు. రాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కొద్ది సేపటికి తేరుకుని కుక్కపిల్లల్ని దగ్గరికి తీసుకుని వాటికి ఆప్యాయంగా పాలు తాగించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...