అక్టోబర్ 17, 2020

పరిశ్రమలో డైరెక్టర్ గా కొనసాగడానికి ఏమి చెయ్యాలి

 సినిమా రంగం అంటే అందరికీ తెలిసిన రంగం. చిన్నప్పటి నుంచి ఎంతోమంది సినిమా నిర్మాతలు అవ్వాలి.డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రయాణంలో కొంతమంది సినిమాలో డైరెక్టర్ అవ్వవచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. అయితే ఇప్పుడు పరిశ్రమ గురించి చూద్దాం ఎలా ఉంటుందో. నైపుణ్యాలు ఉన్న వ్యక్తిని ఏ పరిశ్రమ కూడా వదులుకోలేదు. వచ్చిన అవకాశాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా తెలిసిన డైరెక్టర్ గారి దగ్గర సహ - డైరెక్టర్ లాగా చేరాలి. డైరెక్టర్ చెప్పినట్లుగా వినాలి. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.


హీరోలతో మంచిగా మెలగాలి. అలాగే నిర్మాతలతోను తోటివారితోను మంచిగా ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిశీలించాలి. డైరెక్టర్ కెమెరాలను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఎప్పటికప్పుడు మనలోని సృజనాత్మకతను బయటికి తీసుకురావాలి. అప్పుడప్పుడు డైరెక్టర్ కి సలహాలు ఇవ్వాలి. మనం సలహాలు ఇస్తున్నప్పుడు డైరెక్టర్ కి నచ్చినట్లయితే ఇంకా కలుపుగోలుగా ఉంటారు. అలాగే కొత్త కొత్త నిర్మాతలను కలుసుకుంటూ ఉండాలి. మనకు తెలిసిన రచయితలతో ఎప్పుడు సోదర భావంతో ఉండాలి. ఎందుకంటే మనకి రచయితలతో చాలా పని ఉంటుంది. ఒక సినిమా కథ బాగా ఉండాలన్నా సినిమా బాగా రావాలని అన్న డైరెక్టర్ పాత్ర ఎంతో, రచయిత పాత్ర చాలా ఉంటుంది.

మనకు తెలిసిన రచయిత తో ఒక మంచి కథను ఎన్నుకోవచ్చు. ఆ కథను తీసుకొని వెళ్లి నిర్మాతను కలిస్తే మనం కూడా డైరెక్టర్ అవ్వచ్చు. మనకథ తీసుకోవాలి, లేదా అన్నది నిర్మాత మేనా ఆధారపడి ఉంటుంది. అలాగే డైరెక్టర్ కూడా మనల్ని డైరెక్టర్లా గా పరిచయం చేయవచ్చు. పరిశ్రమ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్లతో కలుపుగోలుగా మెలుగుతూ ఉండాలి. దీనికితోడు మన లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఒక మంచి సినిమాకి డైరెక్టర్ గా నీ చేసినట్లయితే తర్వాత కూడా పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. ఇక సహా డైరెక్టర్ నుంచి డైరెక్టర్ స్థాయికి లో ఉండవచ్చు. మనకి తెలిసిన వాళ్ళు మనతో సినిమా తీయవచ్చు. ఒకసారి ప్రేక్షకుల్లోనూ మిమ్మల్ని డైరెక్టర్ లాగా ఆదరిస్తే ఇక మీకు తిరుగు ఉండదు. పరిశ్రమలో కొనసాగవచ్చు. విజయపరంపరను కొనసాగించవచ్చు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు డైరెక్టర్ గా పని చేయవచ్చు. మన కృషి ఫలితమే మన సినిమా అనేది ప్రేక్షకులు ఆదరించాలని లేదా అనేది తెలుస్తుంది. పగలు,రాత్రి లేకుండా కష్టపడాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది పరిశ్రమకు చాలా ఉపయోగం అయిన పదం. ఎంత కష్టపడితే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి.

మిమ్మల్ని మీరు డైరెక్ట్ లో చూసుకోవచ్చు. మీరు చేసే ప్రతి పని కూడా చాలా గమనించి చెయ్యాలి. ఎక్కడ తొందరపడకూడదు. పని మీద చాలా ఏకాగ్రతతో ఉండాలి. పరిశ్రమలో వీరు మంచి ఆదాయం కూడా పొందవచ్చు. అంటే కోటీశ్వరులు అవ్వవచ్చు. ఇక ప్రేక్షకుల చేత జై జై లే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...