ఏదైనా పని చేసేటప్పుడు ఈ పని చేయగలనా లేదా అనే ఆలోచన మనిషికి రావడం సర్వసాధారణం. మీరు ఖచతంగా చేస్తారు అంటే ఆ పని ఏదైనా చేయగలరు. లేదు నావల్ల కాదు నేను చేయలేను అంటే చేయలేరు. ఉదాహరణకు మీకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. కానీ మీరు క్రికెట్ ఆటలు ఆడ లేరు. అంటే ఇష్ట పడ్డారు కానీ ఆడడం రాదు. మీరు ఖచతంగా నేను ఆడాలి అని పట్టుదలతో ప్రయత్నిస్తే కచ్చితంగా నేర్చుకోగలరు. సచిన్ ఆట అంటే ఇష్టం. మీరు ప్రయత్నిస్తే సచిన్ లాగా ఖచ్చతంగా ఆడగలరు. ఏదైనా ప్రయత్నించడం చాలా ముఖ్యం. ప్రయత్నించి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ముందు మిమ్మల్ని మీరు 100% ఖచ్చితంగా నమ్మండి. అందరు మనుషులు ఒకటే. ఎవరైనా చనిపోవలసింది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. పుట్టుక మరియు చావు మధ్య మనిషి బ్రతుకు. ఇందులో కొంతమది విజయం సాధిస్తారు. కొంతమంది సాధించలేకపోవచ్చు. సాధించాలి అనే తపన ఉన్న వ్యక్తికి అంగవైకల్యం అనేది అడ్డురాదు. కేవలం మనిషికీ మెదడు అతి ముఖ్యమైనది. ఇంకా మన ఆలోచనా విధానం అనేది చాలా ముఖ్యం. ఒక విషయాన్ని చాలా విధాలుగా ఆలోచించవచ్చు. మీరు లేక నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నాను అనేది అవసరం.
cr
సమస్య గురించి ఆలోచిస్తే సమస్య ఎక్కువ అవుతుంది. కొన్ని సమస్యలను ఏమీ చేయలేము. అంటే మన జీవితంలో చచ్చేవరకు వాటిని అనుభవించవలసిందే. వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకూడదు. సమస్య సమస్య అలాగే చూడాలి.
పెద్దలు చెప్పినట్లు ప్రతి ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్లు ఎందుకు ఆ మాట అన్నారు అనేది ఆలోచించాలి. అవును ప్రతి ఒక సమస్యకు పరిష్కారం ఉంది. అది నువ్వే. నువ్వు అనుకుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలవు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జీవితంలో ఎప్పుడు ఆనందమే ఉండదు కూడా ఉంటుంది అనేది. ఎప్పుడు,ఎక్కడ ఏ విషయానికి అసలు భయపడవద్దు. భయపడితే భయమస్తుంది. భయం లేదు అనుకుంటే ఏమీ ఉండదు. ఉదాహరణకు పుట్టుకతో రెండు చేతులు లేకుండా పుడితే మీకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తెలిసి ఈ విషయం గురించి బాధ పడితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ విషయం గురించి మీరు ఏమీ చేయలేరు. మనం మార్చలేని దాని గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చిన లోపం ఆ లోపాన్ని సరి చేయలేము. ఆ విషయాన్ని అంతటితో వదిలేయ్ జీవితంలో ముందుకు వెళ్ళాలి. గతం గతః అన్నట్లుగా ఉండాలి. ఇలా అనడం చాలా తేలికే. కానీ అనుభవించే వారికి ఆ బాధ అనేది పదేపదే మనసును చేస్తూ ఉంటుంది. తప్పదు ఇంకో మార్గం లేదు.
మీ మెదడును పదును పెట్టండి. మనిషి అనుకుంటే ప్రతిదీ చేయగలడు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you want to ask me anything just ask here