బాధలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం.నువ్వు బాధ అని అనుకుంటే బాధ సంతోషం అని అనుకుంటే సంతోషం.ఏది స్వీకరించారు అనేది మన ఇష్టం.డబ్బు ఉన్న వారు సుఖంగా బ్రతుకుతారు అని ఏమీ ఉండదు.డబ్బు లేని వారు దుఃఖంలో బతుకుతారు అని ఏమీ ఉండదు. ఎవరి బాధలు, ఎవరి కష్టాలు వారివి.గొప్ప వారి ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి.వారు కూడా బాధలు భరించాల్సి వస్తుంది.అంబానీ లాంటి వ్యాపారవేత్తను చూడండి ఎంత కష్టపడతాడు.
చాలామంది ఏమీ అనుకుంటారు అంటే అంబానీ ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నాడు అని.ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి.ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు.ఆయన సమయానికి భోజనం చేయకపోవచ్చు. అలాగే అతనికీ కుటుంబం ఉంటుంది.సమస్యలు ఉంటాయి.వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి.
ప్రతిపక్ష పార్టీలకు సమాధానాలు చెప్పాలి.అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకోవాలి.వారి కష్టాలు వారివి.అలాగే కలెక్టర్ గారు కూడా ఆనందంగా మరియు హుందాగా ఏమి జీవించారు.ఆయన మీద చాలా బాధ్యత ఉంటుంది.చాలా ఒత్తిడిని అనుభవిస్తారు.
అమెరికా అధ్యక్షుడు సైతం ఒత్తిడిని అనుభవించ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది.ఒకవైపు కుటుంబానికి, ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవాలి.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎంత డబ్బు ఉన్న మనిషి ప్రాణాలను కాపాడే లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పేదవాడు అయినా ఒకటే.ధనికుడు అయిన ఒకటే.గొప్ప వారి జీవితాలు డబ్బు ఎక్కువగా ఉన్న వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి అనడం అవివేకం అవుతుంది.సమస్యలు అనేవి అందరికీ సర్వసాధారణం. సమస్యను చూసి బాధపడకూడదు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వారివి.
గొప్ప వారు గొప్పగా జీవించాడు అని చెప్పి ఏమీ ఉండదు. బాధలు ఎవరివైనా ఒకటే.అందరి ఇళ్లల్లో సమస్యలు ఉంటాయి.సమస్య లేని జీవితం ఉండదు.
ధనిక పేద అనే వారికి సమస్యలు లేకుండా ఉండవు.ఎవరి జీవితాలు ఆనందంగా ఉండవు.ఏదో ఫేస్బుక్ లో ఫోటో దిగిన అంతమాత్రాన ఆనందంగా ఉన్నారు అని అనుకుంటాం.అది చాలా తప్పు.నవ్వినంత మాత్రాన ఆనందంగా ఉన్నారు అని చెప్పలేము.అలాగే బాధ పడినంత మాత్రాన బాధలో ఉన్నాము అని చెప్పలేం. సమస్య అనేది అందరికీ ఒకటే. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది.ఈ విషయం తెలుసుకొని జీవించడం చాలా ముఖ్యం.ఎవరి బాధలు వారికి అర్థం అవతాయి. కొంతమంది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కూడా కొంతమంది అర్థం చేసుకోకపోవచ్చు.అర్థం చేసుకోవాలి అనేది వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది.సమస్య అర్థం చేసుకున్న వ్యక్తి మేధావి అవుతాడు.మేధావులు సమస్యను చూసి బాధ పడరు.పరిష్కారం కోసం ఆలోచిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
If you want to ask me anything just ask here