అక్టోబర్ 17, 2020

కొన్ని సమస్యలను పరిష్కరించలేని వాటిని మన మనసులో నుంచి తీసేయాలి

 జీవితంలో మనిషి చాలా బాధలు ఉంటాయి.అలాగే ఆనందం కూడా ఉంటుంది.ఇక చూస్తే మనిషి జీవితంలో కొన్ని బాధలను ఏమీ చేయలేము.అంటే వాటికి పరిష్కారం దొరకక పోవచ్చు.ఆ సమస్యలకు పరిష్కారం నువ్వు మాత్రమే అని తెలుసుకో.ఆ సమస్యను మీ మనసులో నుంచి తీసేయ్.జీవితంలో ఎన్ని రోజులు సుఖాలు ఉంటాయి అన్ని రోజులు కూడా ఉండవచ్చు.ఏడ్చిన వ్యక్తి నవ్వక మానడు నవ్విన వ్యక్తి ఏడవక మానడు. పెద్దలు చెబుతూ ఉంటారు ఒక సమస్య ఉంటే ఆ సమస్య కచ్చితంగా పరిష్కార మార్గం ఉంటుంది.అదే ఆ పరిష్కార మార్గం ఏమిటి అంటే ఆ సమస్యని మనం మరిచిపో.


ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండాలని ఏమీ లేదు.ఎవరి ఆలోచనలు వారివి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది.అమ్మ కడుపులో పుట్టే ప్రతి ఒక బిడ్డ ఒకేలా పుట్టాలని ఏమీలేదు. అంటే కొంతమంది కాళ్లు లేకుండా పుట్టవచ్చు చేతులు లేకుండా పుట్టవచ్చు.కొంతమంది మానసిక వికలాంగులుగా పుట్టొచ్చు.అలా పుట్టిన దానికి నువ్వు ఏమి చేయగలవు.ఆ సమస్యని మర్చి పోవడం తప్ప.పుట్టుక అనేది మన ఆధీనంలో లేదు.అలాగే మన మరణం కూడా మన ఆధీనంలో లేదు.ఇలాంటి విషయాల గురించి ఆలోచించాల్సిన పని అసలు లేదు.ఎందుకంటే ఇది ఉపయోగం లేని పని.అలాంటప్పుడు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు ఆలోచిస్తున్నావు.

జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.ఇప్పుడు ఉంది కేవలం బిజీ బిజీ జీవితమే అందరిదీ.ఈ సమస్యను ఎవరికి చెప్పినా కూడా వారు పట్టించుకోకపోవచ్చు.ఎందుకంటే మీ గురించి ఆలోచించే సమయం వారికి లేకపోవచ్చు.వాళ్ళ బాధ అనేది నీకు తెలియదు.మనుషుల పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటది.కానీ నువ్వు వాళ్ళ బాధ తో పోల్చుకోని నా భాద పెద్దది అని అనుకోకూడదు.నీకు చిన్నది నటించిన సమస్య వారికి పెద్దగా అనిపించవచ్చు అలాగే వాళ్ళకి పెద్దది అనిపించిన విషయం నీకు చిన్నగా కనిపించవచ్చు.

సమస్య ఇంకా వేధిస్తుంటే మానసిక నిపుణులను కలవడం చాలా మంచిది.వారు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించవచ్చు.కానీ కొన్ని సమస్యలను పరిష్కరించలేము. ఎలా అంటే కాళ్ళు పోతే ఆ కాలిని అలాగే మనం సర్దుబాటు చేయలేము.అలాగే జరిగిపోయిన గతం ని కూడా తీసుకొని రాలేము.ఈ సమస్యని మనం వదిలేసి మన జీవితంలో ముందుకు వెళ్లాలి.ఈ ప్రపంచంలో చాలా సమస్యలను పరిష్కరించలేము.మనిషిని వేధించే సమస్యలు ఈ రోజుల్లో మరియు ముఖ్యంగా మానసిక సమస్యలు ఉండవచ్చు.మనం ఆలోచించినట్లయితే ఎదుటి వ్యక్తి ఆలోచించాలి అని ఏమీ లేదు.ఎవరి ఆలోచనలు వారివి ఎవరి మనోభావాలు వాళ్ళవి.ఒక వ్యక్తి తప్పు చేస్తూ వుంటే తను చేసిన తప్పు అని చెప్పడం అంత వరకు నీ బాధ్యత.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...