అక్టోబర్ 17, 2020

కొన్ని విషయాలు తెలిసి కూడా మిమల్ని మీరు మోసం చేసుకోకండి

 ప్రతి టీన్ కష్టపడితేనే ఎంతటి ఉన్నత స్థానాలను అయినా అధిరోహించవచ్చు.అంతటి ఉన్నత స్థానాల్లో ఉండి కూడా కొంతమంది తప్పులను చేస్తారు.పెళ్లి చేసేటప్పుడు వారి కింద పనిచేసే వ్యక్తులకు హాని కలిగిస్తాయి.అలాగే వీళ్ళు చేసే మంచి పని వలన చాలా లాభాలు ఉంటాయి. సమాజంలో ఒక వ్యక్తి గాని, ఒక సంస్థ వారు గాని తప్పు చేస్తే దానిని మీరు ఖండించండి.ఎందుకంటే తప్పు చేసే వ్యక్తి తప్పులను చేసుకుంటూ పోతాడు.


ఈరోజు ప్రపంచం నడుస్తుది అంటే ఏమిటి అది కేవలం తప్పు చేయని వారు ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి.అంటే ఒక మంచి వ్యక్తి వలన సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది.ఇంకా అతను కొన్ని వందల మందిలో మార్పు తీసుకొని వస్తాడు.పాఠశాలలో ఉపాధ్యాయుడు తన జీవిత కాలంలో ఎంతోమంది విద్యార్థులను సమాజంలో ఎలా మెలగాలో నేర్పుతాడు.

అలాగే ఒక మంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేస్తారు.ప్రభుత్వ ఉద్యోగి జీతం తీసుకుంటూ అవినీతి చేస్తూ ఉంటాడు.అవినీతి చేయవలసిన అవసరం ఏముంది అసలు.ఆశ అనేది మనిషి చాలా హద్దులో ఉంచుకోవాలి.ఒక మనిషి బ్రతకడానికి మరియు అతని కుటుంబం బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చిన జీతం సరిపోతుంది.అంటే ప్రభుత్వ ఉద్యోగి గురించి నేను చెబుతున్నది.

ఉదాహరణకి ప్రభుత్వం తరఫున కట్టిస్తుంది అనుకుందాం. అవినీతి నాయకుల వలన, ప్రభుత్వ ఉద్యోగి వలన ఆ ఇల్లు నిర్మాణం పటిష్టంగా ఉండకపోవచ్చు.ఇందులో నాయకులకు, అధికారులకు డబ్బు సంపాదించాలి అనే ఆశ వలన కొన్ని లక్షల మందికి అన్యాయం జరుగుతుంది.

సమాజంలోని ఒక తప్పు జరిగితే ప్రశ్నించాలి.లేకపోతే చాలా కష్టం.కొంతమంది తప్పు గురించి ప్రశ్నించాలి అని అనుకుంటారు.తర్వాత మాకు ఎందుకులే మళ్ళీ సమస్య మన పైకి వస్తుంది అని భయం.ఇలాంటి వాళ్ళ వలన తప్పు అనే దానిని అరికట్టలేము.ఏది ఏమైనా ధైర్యంగా ఉండాలి. మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది మేము చేస్తూ ఉన్న పని అనేది చాలా తప్పు అని.బంధువులు అయినా సరే తప్పు చేస్తే ప్రశ్నించండి.దీనిలో మొహమాటం ఏది పెట్టుకోవద్దు.

నిజాయితీగా ఉన్న వ్యక్తి చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోండి.ఏదిఏమైనా తప్పుడు వ్యక్తులను ప్రోత్సహించ వద్దు.అందరు బాగుంటే మనము బాగుంటాము అనే ధోరణిలో ఆలోచించాలి.ఎవరో భయపడుతున్నారు అని భయపడవద్దు.జీవితంలో ఏమి సాధించాలి అని అనుకుంటున్నారు ఆ దిశగా అడుగులు వేయండి.విజయం సాధించండి.ఎప్పుడు ఏ విషయంలో ఎవరికీ భయపడవద్దు.నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేయండి. గుర్తుపెట్టుకోండి మహానుభావులు ఎవరు కూడా తప్పుని ఎక్కడా స్వీకరించలేదు.అలాగే అలాంటి మనుషులను స్వీకరించలేదు.మీ మనసును ఎప్పుడు మీరు ప్రశ్నించుకోండి.నేను చేస్తున్న పని మంచిదా లేదా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

If you want to ask me anything just ask here

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...