నవంబర్ 02, 2020

సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఎలా

 కవిత మా ఇంటికి పెద్ద కూతురే కాదు, రెండు కుటుంబాలకు పెద్ద మనవరాలు కూడా. కవిత పుట్టినప్పుడు కుటుంబం అంతా మా ఊరిలో ఉన్న ఫంక్షన్ కి వెళ్లడం వలన సమయానికి కవిత వాళ్ళ అమ్మ దగ్గర ఎవరూ లేకపోయారు. ఆ సమయంలో హాస్పటల్కి తీసుకెళ్లడానికి సరైన సమయం లేక ఇంటిలో దగ్గరలోని మంత్రసాని చేత పురుడు పోయించారు లలిత అమ్మా నాన్న. ఆ మంత్రానికి సరైన అవగాహన లేక చంటి బిడ్డను పుట్టిన వెంటనే ఏడిపించక పుట్టిన బిడ్డను అలాగే నేలమీద పడుకోబెట్టింది.



ఆ తరువాత కార్యక్రమాలు యధావిధిగా జరిపించి, పుట్టిన పాపాయికి నామకరణం చేసింది కవిత అనే పేరు పెట్టారు. కవిత ఒక సంవత్సరం నిండింది, కానీ అందరి పిల్లల బోర్లా పడడం చేయడం లేదు. ఎక్కడ వేసిన అక్కడే కదలక, మెదలక కుండా ఉండేది.లలితకు కూడా చిన్న వయసు కావడం ఎప్పుడూ తన లోకం పుస్తకాలే కావడం వలన కవితను పట్టించుకునేది కాదు. కవితా తాతగారు లలిత నాన్న గారైన సోమనాథ్ కి ఊళ్లు తిరిగి ఉద్యోగం కావడం వలన వెళ్లిన చోట సరైన సదుపాయాలు లేక పట్టించుకోలేదు.

తరువాత వెనక్కి తిరిగి చూసేసరికి కవిత పరిస్థితి తెలుసుకుని బాధపడి తన ఇంటికి తీసుకుని వెళ్ళి కవిత కవిత మానసిక వికలాంగురాలు అని తెలుసుకుని మందులు వాడుతూ స్వీకరించారు సోమనాథ్. ఆ తరువాత కవిత వాళ్ళ అమ్మమ్మ వాళ్లది చాలా పెద్ద కుటుంబం కావడం వలన అందరి ఆలనాపాలనా కవిత మెల్లమెల్లగా పాకడం చిన్నగా లేచి నిలబడడం చేస్తుంది. కవిత కు ఐదు సంవత్సరాలు వచ్చాయి. లలితా కార్యక్రమంలోనూ ఒక బాబు పుట్టడంతో కవితను పూర్తిగా వాళ్ళ నాన్నగారి దగ్గర వదిలేసింది. కవిత వాళ్ళ తాతగారు ట్రాన్స్ఫర్ మీద లలిత ఉన్న ఊరికి దగ్గరగా రావడం వలన తరుచూ అంతా కలిసి ఉండేవారు.

కొన్నాళ్ళకి సోమనాథ్ గారికి రిటైర్మెంట్ వయసు దగ్గర పడడంతో లలిత ఉన్న ఊరిలో ఇల్లు కట్టుకుని లలితను కూడా తాము దగ్గర ఉంచుకోవాలి అన్న ఆలోచన చేసి అటు వైపు అడుగులు వేశారు. ఆ విధంగానే ఈ కవితను మానసిక వికలాంగుల పాఠశాలలో చేర్చి, తానే దగ్గర ఉండి కవిత విషయాలు చూసేవారు తాతగారు. అలా కవిత కొంచెం బాగవుతుంది సమయానికి సోమనాథ్ గారు,అతని భార్య రెండు సంవత్సరాల గ్యాప్ లో మరణించారు.



అంతవరకూ కవితా బాధ్యత లేని లలితా భార్యాభర్తలు కవితను పట్టించుకోలేదు.తిరిగి స్కూల్ మానిపించి ఇంట్లో ఉంచేశారు.కవిత పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అమ్మమ్మ ఉన్నప్పుడు ఎంతో సందడిగా ఉన్న ఇల్లు అమ్మమ్మ తదనంతరం ఎవరికి వారు అవ్వడం వలన కవిత వాళ్ళ తాతగారు కవిత కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. కానీ సోమనాథ్ గారి మరణాంతరం కవితను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. రాను రాను కవిత ఏది తినాలన్నా రకరకాల జబ్బుల పేరు చెప్పి సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు లలిత వాళ్ళు. ఆఖరికీ కవిత కన్నా తల్లిదండ్రుల కే భారంగా తయారయ్యి, సరియైన ఆలనాపాలనా లేక మరణించింది.


నవంబర్ 01, 2020

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది

 మాది చక్కటి పల్లెటూరు ఆకాశంలో మేఘాలు పక్షుల కిలకిల రావాలు ఎంతో ఆనందంగా ఉంటుంది.ఇంతలో రైతు కి మరింత ఆనందం కలిగించే మంచి వార్త వచ్చింది.అదేమిటంటే మా ఊరికి రాజధాని వచ్చిందో మేము త్వరలో కోటీశ్వరులు అవుతామ అంటూ సంతోషంతో అయిపోయాడు రైతు.ఇంతలో అధికారులు వచ్చి సర్వే చేసి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటూ హామీలు కురిపించారు.రాజధాని కోసం భూములు కొనుగోలు జరిగింది రైతులు సంతోషం ఆగలేదు తమ పిల్లల భవిష్యత్తు మరింత అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషపడ్డారు.



రైతు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. సుఖసంతోషాలతో హాయిగా ఉన్నాడు వ్యవసాయం చేసే పని లేదని సంతోషంలో ఉన్నాడు.ఇలా రైతుకి ఊహించలేనంత అదృష్టం రాగానే తమ పిల్లలకు ఉన్నత చదువుల కోసం వాళ్ల భవిష్యత్తు కోసం రాజధాని భూములు అమ్మి నా డబ్బుతో బ్యాంకులో డిపాజిట్ చేసి కాస్త కాస్త ఖర్చు చేస్తున్నాడు.ఇలా రైతు తన జీవితాన్ని ఆనందంగా సాగించాడు.మాకు ఇంత మేలు చేసిన అధికారులకు ముఖ్యమంత్రికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు రైతులు.

ఇంతలో ఎలక్షన్ టైం రానే వచ్చింది. అంతా మంచి పని చేసిన రైతులకీ ఆ ముఖ్యమంత్రికి ఏమాత్రం ఊహించని అంతగా ఓటమిపాలై చవిచూశారు. కారణం రాజకీయ చరిత్ర మారాలి రాజ్యాంగం మార్పు రావాలి దేశ ప్రగతి ముందుకు పోవాలి అని మరింత బలంగా నమ్మి కొత్త ప్రభుత్వానికి నాంది పలికారు రైతులు.



అలా ఏ దేశమేగినా ఏదైనా జరిగినా నీ వెంటనే ఉంటాను అంటూ పలికాడు మీకోసమే ఉంటాను నీ వెంటే ఉంటాను నీతోనే ఉంటాను ఒక అన్న ఉంటాను తమ్ముడిలా ఉంటాను అంటూ ఏవేవో చెప్పాడు. రాజకీయ నాయకుడు అయ్యాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మంచి వారు అనుకుంటున్నారు మంచి చేస్తారు అనుకున్నారు అనుభవం లేకపోయినా పర్వాలేదు మంచి చేస్తే చాలా అనుకున్నాము కానీ రైతుల నోట్లో మట్టి కొట్టి చూపించాడు.

ప్రజలారా ఓటు ఎంత విలువైందో ఇప్పటికైనా గ్రహించండి మీరు వేసే ఓటు పదిసార్లు ఆలోచించి ఓటు వేయండి ఈ నియోజకవర్గం యొక్క క్యాండెట్ మంచివాడు అని తెలిస్తే వారికి ఓటు వేయండి తప్పులేదు కానీ ఇటువంటి వాళ్లు మనకు పనికి రాని వాళ్లందరికీ ఓటు వేస్తే భవిష్యత్తు అస్తవ్యస్తం అవుతుంది దేశం వెనుకబడి పోతుంది.


కోపం వల్ల కలిగే అనర్ధాలు

 ఒకరోజు తీరిగ్గా కూర్చుని కిటికీ బయటకు చూస్తున్నాను.రోడ్డు పక్కన బండి మీద చాయ్ వేస్తున్నాడు రాజు.ఆ రోజు పని ఎక్కువైంది అతనికి. లారీ డ్రైవర్లు, క్లీనర్లు వేరే వాళ్ళు అందరూ అక్కడ చాయ్ తాగి వెళ్తున్నారు.అంతా కోలాహలంగా ఉంది.

కుక్క అక్కడి జనాల మధ్య తిరుగుతూ వాళ్ళు ఏదైనా పడేస్తే తింటుంది.రాజు దాన్ని తరుముతున్నాడు, ఎంత తరిమిన మళ్ళీ వచ్చి జనాల కాళ్ళ మధ్య జరుగుతుంది.కొందరు దాన్ని దగ్గరకు పిలుచుకొని బిస్కెట్ లాంటివి తినిపిస్తున్నారు.




ఒక డ్రైవరు ఫోన్లో ఎవరితోనో కోపం గా మాట్లాడు కుంటూ ఛాయ్ బండి వైపు వచ్చి కూర్చున్నాడు. కోపంగా మాట్లాడుతూ రాజు ఇచ్చిన ఛాయ్ చేతిలోకి తీసుకున్నాడు.ఇంతలో కాలికి ఏదో తగ్గినట్టు అనిపించినా ఒక్కసారిగా లేచేసరికి చేతిలో ఉన్న చాయ్ షర్ట్ పై పడిపోయింది. ఏమైంది ఏమైంది అంటూ వచ్చి చూసాడు రాజు. రాజు ఏముంది అదే కుక్క, రాజు మీద గయ్ మని లేచాడు ఆ డ్రైవర్. ఈ కుక్కలు ఎందుకు పెంచుతున్నావు అని కేకలు పెట్టాడు. లేదు ఆ పక్క నాది కాదు క్షమించండి అని చెప్పి అతనికి ఇంకో చాయ్ ఇచ్చి పంపించాడు. కుక్క ను తిడుతూ దాని మీదకి బండరాయిని కోపంగా విసిరాడు రాజు, కుక్క తప్పించుకుని దూరంగా పారిపోయింది. రాజు మళ్లీ పనిలో నిమగ్నమయ్యాడు.

జనాలు వస్తున్నారు వెళ్తున్నారు,కొద్దిసేపు కుక్క కనబడలేదు. ఎండ నడి నెత్తి మీద వచ్చింది. రాజు వ్యాపారం చాలా బాగా నడుస్తుంది కానీ చాలా పని ఒత్తిడిలో ఉన్నాడు. పాల ప్యాకెట్ చింపి గిన్నెలో పోశాడు. ఎవరో పలకరించగా అటు తిరిగాడు ఇంతలో గిన్నె పడిన చప్పుడు విని ఇటు చూశాడు. కుక్క పాలన్నీ పారబోసి ఉంది. అతనికి మతిపోయింది, కోపంతో ఊగిపోయాడు. పెద్ద కర్ర తీసుకొని కుక్క నడుము మీద ఒక్క దెబ్బ వేసాడు. కుక్క కుప్పకూలిపోయింది. రాజుకి కోపం చల్లారలేదు ఇంకో దెబ్బ వేసేసరికి అది సరిగ్గా కుక్క తల పై పడింది. ఆ దెబ్బకి కుక్క చచ్చిపోయింది. అందరూ చూస్తూ ఉండిపోయారు. కుక్క చనిపోతుందని అతను అనుకోలేదు.



ఇంతలో నాలుగు కుక్క పిల్లలు వచ్చి చనిపోయిన కుక్క చుట్టూ చేరాయి. పాపం ఆ పిల్లలు దానివి. అది కళ్ళు తెరిచి నడక నేర్చుకున్న సమయానికి అది చనిపోయింది. ఆ దృశ్యం హృదయాన్ని పిండేసే లా ఉంది. చూసిన వాళ్ళందరూ రాజుని తిట్టిపోశారు, అన్యాయంగా మూగ జీవిని చంపావు అన్నారు. రాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కొద్ది సేపటికి తేరుకుని కుక్కపిల్లల్ని దగ్గరికి తీసుకుని వాటికి ఆప్యాయంగా పాలు తాగించాడు.

జీవితం ఎటు అయినా వెళ్ళవచ్చు మిత్రమా.. నువ్వు శ్రమించు

నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకోవాలి మిత్రమా.నీ కోసం ఎవ్వరు రారు.అస్సలు వస్తారు అని కూడా అనుకోకు.ఎవ్వరి బాధలు వారివి.ఎవ్వరి కష్టాలు వారివ...