అయితే ఆలోచించుకో మిత్రమా. సచిన్ టెండూల్కర్ అతని జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో చూడు. కఠోర దీక్ష తో టెండూల్కర్ క్రికెట్ ఆటకు రాజు అయ్యాడు. అలాగే సినిమాలలో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి, ది గ్రేట్ ఎన్టీఆర్ వీళ్ళందరూ ఎంత శ్రమ పడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారో చూడు. నీ ఆలోచనలను అదుపులో పెట్టుకొని ముందుకు కదలాలి మిత్రమా.
ఒక గట్టి లక్షాన్ని పెట్టుకొని దాని కోసం నిరంతరం నువ్వు కష్టపడాలి మిత్రమా. నీ భవిష్యతును బంగారు బాట వేసుకోవాలి. అపజయాలు ఎదురైనా బయపడకు.... క్రుంగిపోకు. ఈ జీవితం నీది సాధించావాల్సింది కూడా నీవే.కొవ్వొత్తి తాను కరిగిపోయి అందరికి వెలుతురిని ఇస్తుంది. అలాగే నువ్వు కూడా మంచి భవిష్యత్ కోసం చాలా ఆనందాలను వదులుకోవాలి.